మరోసారి దొరికిపోయిన రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి ఎంత గొప్ప డైరెక్టరో అందరికీ తెలిసిందే. అయితే ఆయన మాత్రం తనపై ఉన్న కాపీ క్యాట్ ముద్రను చేరిపేసుకోలేక పోతున్నారు. ఇప్పటికే ఆయన ప్రతి సినిమాలో ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి సీన్స్ వరకు కాపీ అని నెటిజన్లు ఎండగడుతున్నారు. తాజాగా RRR విషయంలోనూ అదే జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ కాపీ అంటూ విమర్శలు రాగా.. ఇప్పుడు రిలీజ్ పోస్టర్ మీదా విమర్శలు మొదలయ్యాయి.
ఈ ఏడాది అక్టోబర్ 13న RRR రిలీజ్ చేస్తామంటూ ఈరోజు రాజమౌళి టీమ్ ఒక పోస్టర్ విడుదల చేసింది. అంతే.. నెటిజన్లు ఆధారాలతో సహా ఉతికి ఆరేస్తున్నారు.
సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ఘోస్ట్ రైడర్ సినిమా పోస్టర్ ను కాపీ కొట్టారని నిరూపిస్తున్నారు.
చూస్తుంటే నిజమే అనిపిస్తున్నా.. జక్కన్న టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.