మరో కొత్త వైరస్..కప్పా..
ఇప్పుడు మరో కొత్త వైరస్ కలవర పెడుతోంది..దాని పేరే కప్పా.. కరోనా వైరస్ కొత్త వేరియంట్ల ద్వారా సైన్స్ నూ, శాస్త్రవేత్తలనూ నిరంతరం సవాలు చేస్తోంది. కరోనాకు చెందిన కప్పా వేరియంట్ ఏడు కేసులు ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల మధ్య దేశంలో వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులు రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. డెల్టా మాదిరిగా, కప్పా కూడా కరోనా వైరస్ డబుల్ మ్యూటంట్! రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ కరోనా పాజిటివ్ నమూనాలను ఢిల్లీ లోని ఒక ల్యాబ్‌కు అదేవిధంగా, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి జన్యు శ్రేణి తెలుసుకోవడం కోసం పంపించారు. ఈ క్రమంలో, రెండవ వేవ్ సమయంలో 174 నమూనాలను పంపారు. వీటిలో 166 నమూనాలు డెల్టా వేరియంట్‌కు, ఐదు కప్పా వేరియంట్‌కు చెందినవిగా గుర్తించారు. అదేవిధంగా, ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీలో 109 నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్‌లో 107 నమూనాలు డెల్టా ప్లస్ అలాగే, కప్పా వేరియంట్ రెండు నమూనాలను కనుగొన్నారు. డెల్టా, డెల్టా ప్లస్, లాంబ్డా తరువాత, ఇప్పుడు కప్పా అనే కొత్త వేరియంట్ లేదా కరోనా వైరస్ కొత్త రూపం ప్రజల ఆందోళనను పెంచే విషయంగా మారింది.కప్పా వేరియంట్ కరోనా వైరస్ కొత్త వేరియంట్ కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, కప్పా వేరియంట్‌ను తొలిసారిగా 2020 అక్టోబర్‌లో భారతదేశంలో గుర్తించారు. కప్పా కాకుండా, డెల్టా వేరియంట్ కూడా భారతదేశంలో మొదట కనుగొన్నారు. డబ్ల్యూహెచ్ఓ దీనిని 2021 ఏప్రిల్ 4 న ఆసక్తికర వైవిధ్యంగా ప్రకటించింది.