మాస్క్ పుణ్యమా అని రూ.58కోట్ల జరిమానా

కరోనా సమయంలో మాస్క్ కి ఉన్న ఇంపార్టెంట్ అంతా ఇంతా కాదు.. మాస్క్ పెట్టుకోకపోతే భారీగా ఫైన్ కూడా వేశారు పలు చోట్ల. కాగా భారత్ లో కరోనా వైరస్ కేసులు మరణాల పరంగా మొదటి నుండి మహారాష్ట్రనే ముందు వరుసలో ఉంది.సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీనితో పాటు మొదట్లో కరోనా కేంద్రంగా మారిన ముంబైలో కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. కరోనా వైరస్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు విధించారు. బీఎంసీలో మాస్క్ పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారి నుంచి రూ. 58 కోట్ల జరిమానాను ఇప్పటి వరకు వసూల్ చేశారు. జూన్ 23వ తేదీ వరకు ఆ మొత్తాన్ని వసూలు చేసినట్లు బీఎంసీ తెలిపింది. ముంబై సివిల్ పోలీసులతో పాటు రైల్వే శాఖ ఈ మొత్తం నగదును మాస్క్ లేని వారి నుంచి వసూలు చేసినట్లు వెల్లడించింది. అయితే మహారాష్ట్రలో సెకండ్ వేవ్ సమయంలో అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిత్యం 60 నుంచి 70 వేల వరకూ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది.తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 51667 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో ఒక్క రోజులోనే కరోనా వైరస్ ప్రభావంతో 1329 మంది ప్రాణాలు వదిలారు. ఇక 64527 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఈ మేరకు భారత వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 30134445 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 29128267 మంది కోలుకోగా 393310 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 612868 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గత పదిహేడు రోజులుగా కరోనా పాజిటివ్ రేటు 2.91 శాతం ఉంది. ఇక వీక్లీ పాజిటివ్ రేటు 5శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయి 3.04 శాతంగా ఉంది. ఇదే సమయంలో రికవరీ రేటు 96.61 శాతంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *