మిస్ట‌రీ బ్రిడ్జ్..కుక్క‌లు మాత్ర‌మే చ‌నిపోతున్నాయ‌ట‌..ఏం జ‌రుగుతోంది..

ఆ బ్రిడ్జి ద‌గ్గ‌రికి రాగానే ప‌లు శున‌కాలు మ‌ర‌ణిస్తున్నాయట‌. అస‌లు కార‌ణాలేంటి అనేది ఇప్ప‌టి వ‌ర‌కు తేల‌నే లేదు. ఈ బ్రిడ్డి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కానీ, ఇక్కడ కుక్కలు వచ్చి సూసైడ్ చేసుకుంటున్నాయట. 1960 నుంచి ఈ వంతెనపై వెళ్తున్న కుక్కలు కిందపడి చనిపోతున్నాయి. స్కాట్లాండ్ వెస్ట్ డన్బర్టన్‌షైర్‌లోని ఓవర్టన్ హౌస్‌కి వెళ్లే రోడ్డుపై ఉంటుంది ఈ బ్రిడ్డి. 1895లో దీని నిర్మాణం పూర్తైంది. లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ హెచ్.ఇ. మిల్నర్ ఈ వంతెనను డిజైన్ చేశారు. అంతా ఆయన చెప్పినట్లుగానే నిర్మించారు. ఏం లోపం లేదు.. కానీ చిత్రంగా 1960 నుంచి ఈ వంతెనపై నుంచి వెళ్తున్న కుక్కలు కిందపడి చనిపోతున్నాయట. ఇలా 50కి పైగా కుక్కలు చనిపోతే… 600కు పైగా కుక్కలు పడిపోయినా గాయాలతో బయటపడ్డాయి. వంతెన కింద 50 అడుగుల దిగువలో రఫ్‌గా ఉండే బండరాళ్లపై ఈ కుక్కలు పడిపోతున్నాయి. అవి ఎందుకు అలా చేస్తున్నాయో ఎవరికీ తెలియట్లేదు. అవి ఆత్మహత్య చేసుకుంటూ ఉండొచ్చని కొంత మంది చెప్తున్నారు. పరిశోధకులు ఆ మాటల్ని కొట్టిపారేశారు.. కుక్కలు ఎక్కడైనా సూసైడ్లు చేసుకుంటాయా అని ఎదురు ప్రశ్నించారు. మరైతే అక్కడ ఏం జరుగుతోంది అనే ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేకపోయారు. దాంతో స్కాట్లాండ్‌లోని జంతువులపై హింసను నియంత్రించే సొసైటీ వారు రంగంలోకి దిగారు. తమ సంస్థ నుంచి కొంత మంది ప్రతినిధులను ఆ వంతెన దగ్గరకు వెళ్లి ఎలాగైనా మిస్టరీని ఛేదించి చూపించాలి తెగ ప్రయత్నించారు. కానీ ఏమీ తెలుసుకోలేకపోయారు. ఉత్తిచేతులతో తిరిగి సొసైటీకి పయనం అయ్యారు. కేవలం ఒక ప్రదేశంలోనే జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే మరో షాకింగ్ కోణం కూడా తెరపైకి వచ్చింది. కొంత మంది ఆ బ్రిడ్జి కింద నుంచి ఓ రకమైన జంతువు అరుస్తున్నట్లు శబ్దాలు వస్తుంటాయనీ, అలాగే ప్రత్యేకమైన జంతువు వాసన కూడా వస్తుందనీ ఆ అరుపులు, వాసనకు ఆకర్షించి కుక్కలు దూకేస్తున్నాయని కొందరు వాదించారు. పైగా ఈ అరుపులు, వాసన మనుషులకు రావనీ, కుక్కలకు మాత్రమే వస్తాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *