మెట్రో రైలులో గుండె తరలింపు
ఇప్పటివరకు మనం గుండెను అంబులెన్స్ లో తరలించడం గురించి విన్నాం. తొలిసారిగా హైదరాబాద్ మెట్రో రైలులో ఒక వ్యక్తి గుండెను డాక్టర్లు తరలించారు. మెట్రో రైలు అధికారుల సహకారంతో అపోలో దవాఖాన డాక్టర్లు విజయవంతంగా గుండెను తరలించారు. నల్లగొండ జిల్లాకు చెందిన రైతు (45) బ్రెయిన్ డెడ్ కావడంతో.. అతడి గుండెను దానం చేసేందుకు ఆ కుటుంబం ముందుకొచ్చింది. దీంతో అతని గుండెను జూబ్లీహిల్స్ అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి గుండె మార్పిడి శస్ర్తచికిత్స చేసి వైద్యులు అమర్చనున్నారు. ఎల్బీనగర్ కామినేని దవాఖాన నుంచి జూబ్లీహిల్స్ అపోలో దవాఖానకు గుండెను తరలించారు. ఉప్పల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఉండే ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో మార్గాన్ని ఎంచుకున్నారు.