మెడ్లర్ ఫ్రూట్..కుళ్ళిన తర్వాతే తినాలి..

ఫ్రూట్స్ ఏవైనా సరే ఫ్రెష్ గా తింటారు అందరూ. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పండుని మాత్రం కుళ్ళిన తర్వాతే తినాలి అట. అందుకు కారణం కూడా ఉందండోయ్. ఈ పండు స్పెషాలిటీనే అదట. ఈ పండ్లు కుళ్ళిన తర్వాత మాత్రమే తినడానికి ఉపయోగపడతాయి. వీటిని మెడ్లర్ ఫ్రూట్ అంటారు.ఒకప్పుడు యూరప్‌లో ఈ పండుకి విపరీతమైన డిమాండ్ ఉండేది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన గ్రీకు కవిత్వంలో ఈ ఫ్రూట్ ప్రస్తావన కనిపిస్తుంది. నెమ్మదిగా ఈ పండు రోమన్ కు చేరుకుంది. ఈ చెట్లు చాలా అసాధారణమైనవి. ఇవి డిసెంబరులోమాత్రమే కాస్తాయి.ఈ పండ్లను చెట్టు నుంచి కోసే సమయంలో ఉల్లిపాయ రూపంలో పచ్చగా, గోధుమ రంగులో ఉంటాయి. యాపిల్ రుచిని గుర్తు చేసే ఈ పండును చెట్టునుంచి కోసిన వెంటనే తినకూడదని.. అలా తింటే అనారోగ్యానికి గురవుతారని 18వ శతాబ్దపు వైద్యులు హెచ్చరించారు.అయితే వీటిని కొన్ని రోజులపాటు మగ్గబెట్టి.. కుళ్ళిన తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. ఈ పండులో ఉండే ఎంజైములు క్లిష్టమైన కార్బోహైడ్రేట్‌లను తేలికపాటి చక్కెరలాగా ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌గా మారుస్తుంది. దీని వల్లే వీటికి పుల్లటి రుచి వస్తుంది.ఈ ప్రక్రియనే బ్లేట్టింగ్ అని అంటారు. ఈ పదాన్ని1939లో ఒక బోటనిస్ట్ కనిపెట్టారు.ఈ ప్రక్రియ వల్ల దీనికి బాగా పండిన కర్జూరాన్ని నిమ్మకాయలతో కలిపితే వచ్చే రుచి వస్తుంది. ఈ పండ్లలో విటమిన్లు, 80% కంటే ఎక్కువ నీరు ఉన్నాయి. మెడ్లార్ దాహార్తిని తీరుస్తుంది. తక్కువ చక్కెరను కలిగి ఉంటుంది కనుక బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు మంచిది. డయాబెటిస్ ఉన్నవారు కూడా పండ్లు తినవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *