మేఘాల కంటే ఎత్తులో ఊరు..వర్షమే కురవదట..

ప్రపంచంలో ఎన్నో ఎత్తయిన కొండలు..లోయలు ఉన్నాయి. అయితే మేఘాలను మించి ఊరు ఉంటే వర్షం కురిసేది మేఘాల వల్లే కదా..మరి మేఘాల కంటే పైన ఊరు ఉంటే వారికి వర్షం గురించి ఎలా తెలుస్తుంది. అదే జరుగుతోంది ఇక్కడ. అక్కడి ప్రజలకి ఎండ..చలి గురించి తెలుసు..కానీ అక్కడ మాత్రం వర్షం కురవదట. ఎక్కడా అనుకుంటున్నారా.. యెమెన్ ఓ అరబ్ దేశం. ఈ దేశానికి రాజధాని సనా. ఈ రాజధాని పరిధిలో అల్ హుతైబ్ అనే సుందరమైన గ్రామం ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది భూ ఉపరితలం నుంచి 3,200 మీటర్ల ఎత్తులో ఓ కొండపై కొలువై ఉంది. ఈ గ్రామంలో అల్ బోహ్రా, అల్ ముఖర్మ తెగలకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. వివరాల్లోకి వెళ్తే ఈ ఊర్లో ఇప్పటివరకు వర్షం పడలేదు. ఈ ఊరు మేఘాల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడమే అందుకు కారణం.అల్ హుతైబ్ లో ఎండ, చలి మాత్రం తీవ్రస్థాయిలో ఉంటాయి. ఎంతో ఎత్తయిన కొండపై ఈ ఊరు ఉండడం వల్ల మేఘాలన్నీ ఈ ఊరు కిందిగా వెళుతుంటాయి. మేఘాలు కొండ కింది భాగంలో వర్షించేటప్పుడు ఈ ఊరి నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఈ గ్రామం ఓ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది.ప్రపంచం నలుమూలల నుంచి అల్ హుతైబ్ గ్రామాన్ని చూడడానికి పర్యాటకులు వస్తుంటారు. ఎత్తయిన ఈ కొండపై నిల్చుని, దిగువన ఉన్న మేఘాల నుంచి భూమ్మీదకు జాలువారే వర్షపాతాన్ని చూడడం ఓ మధురానుభూతిగా భావిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *