మొసలి నోట్లో చెయ్యి..అసలు సంగతేంటీ..
కొన్ని ప్రమాదకరమైన జంతువుల జోలికి వెళ్ళకుండా ఉండటమే బెస్ట్..లేదని పాముకి పాలు పోసినా కాటు వేయక మానదు అనే సామెత తీరుగానే ఉంటుంది. ఇప్పుడదే జరిగింది ఓ వ్యక్తికి. విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి నోరు తెరిచి ఉన్న మొసలి నోట్లో కుడి చెయ్యి పెట్టాడు. ఆ తర్వాత ఏదో వివరిస్తూ… ఎడమ చెయ్యి పెట్టాడు. కొద్దిగా కాదు… మొత్తం చెయ్యి అంతా పట్టేలా ఇంకా ఇంకా దూర్చాడు. ఆ తర్వాత ఏదేదో చెబుతూ… మొసలివైపు చూస్తూ… హడావుడి చేశాడు. అంతలో ఊహించని షాక్ ఇచ్చింది మొసలి. ఒక్కసారిగా చెయ్యిని కొరికేసి, నమిలేసింది. దాంతో… తిప్పలు పడుతూ… లబోదిబోమంటూ… చెయ్యిని ఎలాగొలా వెనక్కి తీసుకున్నాడు. కానీ అప్పటికే పెద్దగాయాలు అయ్యాయి. తెలిసి తెలిసి మొసలి నోట్లో చెయ్యి పెడితే ఇలాగే ఉంటుంది మరి.