యాడ్ కోసం ఎత్త‌యిన క‌ట్ట‌డంపై ఎయిర్ హోస్టెస్..

ఓ ఎయిర్‌హోస్టెస్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం బుర్జ్‌ ఖలీఫాపై నిల్చుని తన సంస్థ గురించి చెప్పడం విశేషం. అంత ఎత్తయిన ప్రదేశంలో ఆమెను చూసి నెటిజన్లకు గుండె దడ పెరిగింది. దీంతో ఆ సాహసం చేసిన ధీరవనిత ఎవరా అని ఆరా తీస్తున్నారంతా.. ఇంతకీ ఆ యాడ్‌లో నటించిన యువతి ఎవరంటే.. యూకేకు చెందిన నికోల్‌ స్మిత్‌ లడ్విక్‌. యూఏఈకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ చేసిన ఓ వాణిజ్య ప్రకటన ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఒక ఎయిర్‌హోస్టెస్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం బుర్జ్‌ ఖలీఫాపై నిల్చుని తన సంస్థ గురించి చెప్పడం ఈ యాడ్‌ విశేషం. ఎమిరేట్స్‌ యాడ్‌లో క్యాబిన్‌ సిబ్బందిగా కన్పించిన నికోల్‌ స్మిత్‌ వృత్తిరీత్యా స్కైడైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌. ఆమెకు ప్రయాణాలు, సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం. తానో వరల్డ్‌ ట్రావెలర్‌, స్కై డైవర్‌, యోగా ఇన్‌స్ట్రక్టర్‌, హైకర్‌, అడ్వెంచరర్‌ అని నికోల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో రాసుకున్నారు. తాను చేసిన సాహసాల ఫొటోలను ఆమె ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. తాజాగా ఎమిరేట్స్‌ యాడ్‌తో ఆమె పేరు నెట్టింట్లో మార్మోగుతోంది. మరి ఆమె అడ్వెంచర్‌ ఫొటోలపై మీరూ ఓసారి లుక్కేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *