రంగుల పైధాన్..ఎక్కడో తెలుసా..
కొండ చిలువనని మీరు ఎప్పుడైనా చూశారా..మహా అయితే పసుపు..బ్లాక్ ఇలా పలు రంగుల్లో ఉంటాయి కొండ చిలువలు. అయితే మీరు ఎప్పుడయినా.. రెయిన్బో పైధాన్ను చూడకపోతే ఈ ఫొటోనే చూడండి . కాలిఫోర్నియాకు చెందిన రెప్టైల్ జూ వ్యవస్ధాపకుడు జే బ్రూయర్ షేర్ చేసిన ఈ పైధాన్ దాని రంగులు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. ఈ ఏడాది మేలో ఈ వీడియోను ఆయన తన ఇన్స్టాగ్రాం హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ కాగానే ఇన్‌స్టా రీల్ వైరల్ అయింది. ఈ వీడియో 2 కోట్లకు పైగా వ్యూస్, 9.8 లక్షల లైక్‌లను రాబట్టింది. జే తరచూ ఇలాంటి అద్భుత వీడియోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తుంటారు. తాజా వీడియోలో ఆయన రెయిన్బో పైధాన్ను చూపగా, ఆపై దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇంతకన్నా మంచిది దొరకదు అని తన పోస్ట్‌కు జే క్యాప్షన్ ఇచ్చారు. ఈ రంగుల పైధాన్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ రంగుల పైధాన్ న్యూయార్క్ లో కనిపించింది.