రాజ‌కీయాల్లోకి సోనూసూద్ సోద‌రి..ఎక్క‌డ పోటీ చేస్తున్నారో తెలుసా..

క‌రోనా క‌ష్ట కాలంలో ఎంతోమంది కార్మికుల‌ని ఆదుకుని త‌న‌కి చేత‌నైన సాయ‌మందించాడు హీరో సోనూసూద్. ఇప్పుడీయ‌న ఓ సెన్సేష‌న్. ప‌లువురికి దేవుడు కూడా. అయితే సోనూ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని అంతా అనుకుంటోన్న త‌రుణంలో ఆయ‌నో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.తన సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అన్నది పక్కనపెట్టాలని, దానిపై తన నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. ముందు మోగాలో మాళవికకు మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఆరోగ్య రంగమే ఆమెకు కీలకమని, గెలిస్తే కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా డయాలిసిస్ సేవలను అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగిత సమస్యపైనా పోరాడుతుందన్నారు. ఉద్యోగం లేనప్పుడే యువత డ్రగ్స్ తీసుకుని చెడు దారులు తొక్కుతుందని అన్నారు.రాబోయే పంజాబ్ ఎన్నికల్లో మోగా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారని ఆయన వెల్లడించారు. ఇవాళ తన సోదరి మాళవికా సూద్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సరైన సమయంలో ఆ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు మాళవిక సిద్ధమైందన్నారు. ఇటీవలే తాను రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీని కలిశానని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ నూ కలుస్తానని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరాలన్నది సిద్ధాంతాలకు సంబంధించిన విషయమని, సమావేశాలతో అదయ్యేది కాదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *