రావణుడి లంకలో పెట్రోల్ లీటర్ రూ.51..
బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీట్
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై సెటైర్ వేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. ప్రతిపక్షమైనా, స్వపక్షమైనా.. ఉన్నదున్నట్లు మాట్లాడే ఆయన పెరుగుతున్న పెట్రోల్ ధరలపై స్పందిస్తూ ఈ సెటైర్ వేశారు. రాముడి ఇండియాలో పెట్రోల్ లీటర్ ధర రూ.93గా ఉన్నదని, అదే సీతాదేవి నేపాల్‌లో రూ.53గా, రావణుడి లంకలో రూ.51గా ఉన్నదంటూ ఓ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతున్నది. ముఖ్యంగా పెట్రోల్ ధరలపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో సొంత పార్టీ ఎంపీయే ఇలాంటి సెటైర్ వేయడం బీజేపీకి మింగుడు పడనిదిగానే చెప్పాలి.
— Subramanian Swamy (@Swamy39) February 2, 2021