రేపటి నుంచి కృష్ణ ఎక్స్ ప్రెస్ పున:ప్రారంభం!

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నిలిపివేసిన కృష్ణ ఎక్స్ ప్రెస్ రైలును బుధవారం నుంచి పున:ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి ఆదిలాబాద్ మధ్య నడిచే ఈ రైలు ప్రతి రోజు నడువనున్నది. దీంతో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లేవారికి సౌకర్యవంతగా ఉండనున్నది. ఈ రైలులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మహారాష్ట్రవారు కూడా ఎక్కువ సంఖ్యలో తిరుపతికి చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *