లాంగ్ డ్రైవ్ సోకు.. ఇంజినీరింగ్ విద్యార్థుల బలి
లాంగ్ డ్రైవ్ కోసం వచ్చిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు డివైడర్‌ను ఢీకొని మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న వినయ్‌కుమార్‌రెడ్డి (23) గురునానక్ కళాశాలలో, సన్ని రామిరెడ్డి (21) శ్రీదత్త కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. డ్యూక్ బైక్ పై లాంగ్‌డ్రైవ్ కోసం శుక్రవారం ఎల్బీనగర్ నుంచి డీఎల్‌ఎఫ్ వెళ్తూ కొత్తగూడలో డివైడర్‌ను ఢీకొన్నారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు.