లావుగా ఉన్నవారిని అద్దెకి ఇస్తారట..

పలువురు బ్యాచిలర్స్ కి ఇళ్ళు అద్దెకి ఇవ్వరని తెలుసు. అయితే ఇక్కడ లావుగా ఉన్నవారికి మాత్రమే ఇళ్ళు అద్దెకి ఇస్తారట.అంతేకాదు లావుగా ఉన్నవారిని అద్దెకి ఇస్తారట. మరి అలా ఎందుకు వారు చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా. విషయంలోకి వెళ్లితే లావుగా ఉన్న వారి కోసమే జపాన్ కు చెందిన బ్లిస్ అనే వ్యక్తి ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. దెబుకారీ అనే సంస్థను స్థాపించారు. గంటకు కొంత చొప్పున లావుగా ఉన్నవారిని అద్దెకిస్తున్నారు.లావుగా ఉన్నవారిని అద్దెకు తీసుకోవడం ఎందుకు అనే సందేహం వస్తుంది. ఓ గీత ఎంత పెద్దగా ఉన్నా… దాని పక్కన మరో పెద్దగీత ఉంటే అది చిన్నగా అవుతుంది. ఇదీ అంతే. ఎవరైనా లావుగా ఉన్నవాళ్లు ఏదైనా కార్యక్రమం వేడుకకు వెళ్లేటప్పుడు తమకంటే లావుగా ఉన్నవాళ్లని తీసుకెళ్తే చాలు వాళ్లకు కొంచెం ఆత్మన్యూనత తగ్గుతుంది. తాము లావుగా ఉన్నామని భావన పోతుంది. అందుకే ఆ దేశంలో లావుగా ఉన్నవాళ్లను అద్దెకు తీసుకుంటున్నారట.బరువును తగ్గించే జిమ్ సెంటర్లు న్యూట్రిషన్ సంస్థలు ఫిట్ నెస్ సెంటర్లు తమ ప్రచారాల కోసం లావుగా ఉన్నవారిని తీసుకోవచ్చు. అంతేకాకుండా లావుగా ఉన్న వారి బంధువుల కోసం దుస్తులు ఇతర వస్తువులు కొనుగోలు చేయడం కోసం లావుగా ఉన్నవారిని అద్దెకి తీసుకోవచ్చు. ఈ సంస్థను స్థాపించిన బ్లిస్ అనే వ్యక్తి 2017లో క్యూ జిల్లా పేరుతో లావుగా ఉండే వారికోసం ఫ్యాషన్ బ్రాండ్ ఏర్పాటు చేశారు. దానికోసం లావుగా ఉన్నవాళ్లు ఎవరూ దొరకక పోతే తనకు తెలిసిన వారిలోనే కొందరిని ట్యాలెంట్ ఆధారంగా ఎంపిక చేశారు. ఆ సమయంలోనే అద్దెకిచ్చే ఆలోచనను చేసినట్లు తెలిపారు.వంద కేజీల పైబడిన అమ్మాయిలు అబ్బాయిలను అద్దెకిస్తారు. వారికి గంటకు 200 జపాన్ యెన్లు(రూ.1315)చొప్పున వసూలు చేస్తారు. ఈ ఫీజును ఉద్యోగికే చెందుతుంది. సంస్థకు కేవలం కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంస్థకు అక్కడ మంచి డిమాండ్ ఉంది. జపాన్ లోని టోక్యో ఒసాకా అయిచీ వంటి నగరాల్లో బ్రాంచ్ లు ఉన్నాయి. నాజూకైన అమ్మాయిలు అబ్బాయిలకే పరిమితమైన ఈ తరహా డిమాండ్ లావుగా ఉన్నవారికీ ఉంది. ఆత్మన్యూనత భావం తగ్గించుకోవడానికి లావుగా ఉన్నవారిని అద్దె తీసుకుంటే కాస్త తగ్గుతుందని ఆ దేశస్థుల నమ్మకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *