వికలాంగులకు కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్..

సోషల్ మీడియాలో ఎవరైనా సరే సాయమడిగితే వెంటనే స్పందిస్తుంటారు మంత్రి కేటీఆర్. అంతేకాదు పలు ప్రయోజనాత్మకమైన పధకాలను కూడా ప్రవేశపెడుతుంటారాయన. కాగా రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోసారి త‌న ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆపద్భాంద‌వుడిలా ఆదుకుంటూ.. ఎంతో మందికి అండ‌గా నిలుస్తున్న కేటీఆర్.. ఇప్పుడు విక‌లాంగులకు అండ‌గా నిల‌వ‌బోతున్నారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా.. వంద మంది విక‌లాంగుల‌కు మూడు చ‌క్రాల ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అందించ‌నున్న‌ట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. గ‌తేడాది త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కేటీఆర్.. త‌న సొంత ఖ‌ర్చుల‌తో 6 అంబులెన్స్‌ల‌ను అందించారు. కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు క‌లిసి 90 అంబులెన్స్‌ల‌ను అంద‌జేశారు.త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ముక్కోటి వృక్షార్చ‌న‌లో పాల్గొనాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. లేదా గిప్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా సొంతంగా ఎవ‌రికైనా స‌హాయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పుష్ప‌గుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్‌ల‌పై ఖ‌ర్చు పెట్టొద్ద‌ని కేటీఆర్ కోరారు.మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణ‌యం గొప్ప‌గా ఉంద‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ అన్నారు. త‌మ‌కు ప్రేర‌ణ‌గా నిలిచే నాయ‌కుడి అడుగుజాడ‌ల్లో న‌డ‌వ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. కేటీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా తాను కూడా 50 బైక్‌ల‌ను విరాళంగా ఇస్తాన‌ని బాల్క సుమ‌న్ ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *