శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా

కరోనా కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటున్నది. వ్యాక్సిన్ వచ్చిందని జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ, వైరస్ పూర్తిగా అంతం కాలేదు. అయితే ఇప్పుడు మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం రేపింది. బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల్లో పాజిటివ్‌గా తేలింది. దాంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇటీవల బ్రిటన్‌నుంచి వచ్చిన 5 విమానాల్లో 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రయాణికులందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిలో చాలా మందికి నెగెటివ్ వచ్చింది. 5 విమానాల్లో ప్రయాణించిన దాదాపు 300 మందిని క్వారంటైన్‌కు తరలించారు.

బ్రిటన్‌లో విమానం ఎక్కే ముందు టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలింది. దాంతో ‍‍హైదరాబాద్‌లో దిగాక తిరిగి పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలింది. దాంతో ఇది కరోనానా లేకుంటే బ్రిటన్‌లో కల్లోలం సృష్టిస్తున్న స్ట్రయిన్‌నా అనేది తేలాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌లో పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలించారు. వారిని ప్రత్యేక ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *