సీక్రెట్ రూంలో ‘జెస్సీ’..బిగ్ బాస్ ప్లాన్ ఏంటీ..!

తెలుగు బిగ్ బాస్5 ప‌ది వారాలు పూర్తి చేసుకుంది. .. అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీ విషయంలో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ట్రిట్మెంట్ కోసం.. హౌస్ నుంచి బయటకు జెస్సీని పంపించడంతో ఇటు కంటెస్టెంట్లు , అటు బిగ్‌బాస్ ల‌వ‌ర్స్ షాక్ గుర‌య్యారు. అయితే జెస్సీ పూర్తిగా ఎలిమినేట్ చేశాడా? హౌస్లోకి మ‌ళ్లీ తీసుకుంటాడా? అనేది క్లారిటీ ఇవ్వ‌లేదు . ఇప్పుడే ఇదే స‌స్పెన్స్ గా మారింది. గ‌త రెండు వారాలుగా జెస్సీ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపించాల‌ని బిగ్ బాస్ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈ నిర్ణ‌యం విన‌గానే.. సిరి, షణ్ముఖ్‏లు వెక్కి వెక్కి ఏడ్చారు. మిగితా కంటెస్టెంట్లు చాలా బాధ‌ప‌డ్డారు. కంటెస్టెంట్లంద‌రూ సెండ్ ఆఫ్ చెప్పారు. అంద‌రూ జెస్సీ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇక్క‌డే బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. అనుకోకుండా జెస్సీ తిరిగి సిక్రెట్ రూంలో ద‌ర్శ‌న‌మిచ్చారు. సీక్రెట్ రూంలోకి వచ్చిన జెస్సీ.. ‘నాకు మంచి హెల్త్ చెకప్ చేయించారు.. నాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు.. హెల్త్ కండిషన్ ఒకే.. నేను ఇంకా గేమ్‌లోనే ఉన్నాను.. సీక్రెట్ రూంలో పెట్టినందుకు చాలా థాంక్స్ బిగ్ బాస్’ అని చెప్పాడు జెస్సీ.అనంత‌రం.. బాస్ బాస్ మాట్లాడుతూ.. జెస్సీకి వెల్కమ్ బ్యాక్ చెప్పారు. మిమ్మల్ని వైద్య పరీక్షల కోసం బయటకు తీసుకుని వెళ్లాం.. డాక్టర్లు పరీక్షించి అంత బాగుంద‌ని చెప్పారు. కానీ, ఇంట్లోకి వెళ్లడానికి ముందు మిమ్ముల్ని క్వారంటైన్ ఉంచామ‌ని, బిగ్ బాస్ ఆదేశాలు వచ్చేవరకూ మీరు క్వారంటైన్‌‌లోనే ఉండాలని చెప్పారు బిగ్ బాస్.అయితే.. క్వారంటైన్ అంటే 14 రోజులు పైనే ఉండాల్సి ఉంటుంది. మరి అన్నిరోజులు జెస్సీని సీక్రెట్ రూంలోనే ఉంచుతారంటే.. పలు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *