సెకన్ లో కరోనా పరీక్షలు..

కరోనా ఉందో లేదో నిర్థారణ చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కానీ ఇకపై కరోనా ఉందా లేదా తెలుసుకోవడం చిటికెలో పని అట. కరోనా ప‌రీక్ష‌ల‌ను ఇక‌పై సెకన్‌లో పూర్తిచేయ‌వ‌చ్చు. కరోనా వైరస్ ఇన్వెస్టిగేష‌న్‌ ప్రక్రియను వేగవంతం చేయడంలో పరిశోధకులు గొప్ప విజయాన్ని సాధించారు. వీరు కొత్త పోర్టబుల్ కొవిడ్-19 పరీక్ష కిట్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా కేవ‌లంసెక‌న్‌లోనే కరోనా వైర‌స్‌ను నిర్ధారించే ప‌రీక్ష‌లు జ‌రిపేందుకు వీలుంటుంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. ఇందుకోసం సెన్సార్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. దీని సహాయంతో కరోనాకు కారణమయ్యే సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ను సెకనులోనే గుర్తించవచ్చు. ఇప్పటికే ఉన్న పద్ధతులతో పోల్చితే ఇది వేగవంతమైన పరిశోధన పద్ధతిగా వర్ణిస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ సెన్సార్ మార్కెట్లో ఉన్న గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్ట్‌తో సమానంగా ఉంటుంది. ఈ సెన్సార్‌తో పాటు చిన్న సైజు మైక్రోఫ్లూయిడ్ ఛానల్ ఉంటుంది. మైక్రోఫ్లూయిడ్ ఛానల్ లోపల కొన్ని ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వీటిలో ఒకదానికి బంగారు పూత ఉంటుంది. ద్రవ నమూనాలో కరోనా-సంబంధిత యాంటీబాడీ రసాయన పద్ధతి ద్వారా బంగారు ఉపరితలంపై అంటుకుంటుంది. ఈ విధంగా కరోనా ఇన్వెస్టిగేష‌న్‌కు తీసుకునే సమయాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.ఈ సెన్సార్ సిస్టంను వాక్యూమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బీ జర్నల్‌లో ప్రచురించారు. ఈ ప‌ద్ధ‌తి ద్వారా ఇతర వ్యాధులను కూడా గుర్తించవచ్చు అని ఫ్లోరిడా యూనివ‌ర్సిటీకి చెందిన మింఘాన్ జియాన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *