సెయిల్ లో 100 అప్రంటీస్ ఖాళీలు..
నిరుద్యోగులకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) 100 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు ట్రైనింగ్ ఉంటుందని తెలిపింది. ఏఐసీటీఈ (AICTE) గుర్తింపు పొందిన సంస్థలో ఇంజినీరింగ్ లో డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమో చేసిన వారి కోసం 20 ఖాళీలు, మెకానికల్ ఇంజినీరింగ్ వారి కోసం 20, metallurgy ఇంజినీరింగ్ వారి కోసం 30, కెమికల్ ఇంజినీరింగ్ వారి కోసం 10, సివిల్ ఇంజినీరింగ్ 10, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంఇనీరింగ్ లో డిప్లొమో చేసిన వారి కోసం 10 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు ఫిబ్రవరి 28 నాటికి 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, PH అభ్యర్థులు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అభ్యర్థులు 2017 అనంతరం డిగ్రీ పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు MHRDNATS పోర్టల్ లో ఫిబ్రవరి 19లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. NATS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ నంబర్ పొంది ఉండాలి.