సెలబ్రిటీ డిష్…ఛట్ పటా జామూన్ షాట్స్..గురించి మీకు తెలుసా..

మీరు హైదరాబాదీలా..అయితే మీకు చట్ పటా జామూన్ షాట్స్ గురించి తెలుసా..అదేనండీ నేరేడు పండ్ల రసం..
సింధీ కాల‌నీలో ల‌భించే ఈ చ‌ట్‌ప‌టా జామూన్ షాట్స్ ఆహార ప్రియులకు ‘సెలబ్రిటీ డిష్’గా మారింది. కాల‌నీలోని ఛాట్ వాలా ద‌గ్గ‌ర కేవ‌లం రూ.30కే ల‌భిస్తుంది. పైన చిత్రంలో క‌నిపిస్తున్న‌ట్టే ఒక చిన్న గ్లాసులో ఈ చ‌ట్‌ప‌టా జామూన్ షాట్స్‌ను అందిస్తారు. చూడటానికి ఆల్క‌హాలిక్ షాట్‌లా క‌నిపించే ఈ వైరైటీ జ్యూస్‌పై కొద్దిగా చాట్ మ‌సాలా చ‌ల్లి ఇస్తారు.అయితే, ఇది చూడ‌టానికి ఆల్క‌హాలిక్ చాట్‌లా క‌నిపిస్తున్నా దానిలో ఆల్క‌హాల్ ఉండ‌దు. అది స్వ‌చ్ఛ‌మైన నేరేడు పండ్ల ర‌సం. అవ‌స‌ర‌మైతే ఈ షాట్ డ్రింక్‌లో నేరేడు గింజ‌ల‌ను వేసుకుని కూడా తాగవ‌చ్చు. ఈ చాట్ సెంట‌ర్ ద‌గ్గ‌ర ల‌భించే ముంబై భేల్‌, పంజాబీ భేల్‌, మురుకు శాండ్‌విచ్ లాంటి ప‌దార్థాలు తిన్న త‌ర్వాత ఈ చ‌ట్‌ప‌టా జామూన్ షాట్ సేవించ‌డం మంచి ఫినిషింగ్ ట‌చ్‌గా ప‌నిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *