సెల్ఫీ కోసం రాత్రంతా నదిలో జాగారం..తర్వాత ఏం జరిగిందో తెలుసా..!
ఫొటో తీసుకోవడం అంటే అప్పట్లో పెద్ద పని..కానీ ఇప్పుడు మన చేతిలో సెల్ వుంటే చాలు..పకన మనిషితో కూడా పనిలేకుండా ఓ తెగ సెల్ఫీలని తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ సెల్ఫీల పిచ్చి వల్ల పలువురు ప్రాణాలు పోగొట్టుకోవడం తెలిసిందే. కాగా సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడిపోయాడు ఓ వ్యక్తి.. రాత్రంతా నీటిలోనే జాగారం చేశాడు. చెన్నైలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి రాత్రిపూట ఓ నది దగ్గరికి వెళ్లాడు. అక్కడున్న బ్రిడ్జి మీదికి ఎక్కి.. సెల్ఫీ తీసుకోబోయాడు. అయితే.. సెల్ఫీ తీస్తుండగా.. మనోడి ఫోన్ చేతుల్లో నుంచి జారింది. దీంతో దాన్ని అందుకోవడం కోసం జంప్ చేశాడు. నేరుగా బ్రిడ్జి నుంచి కింద ఉన్న నదిలో పడిపోయాడు. పడగానే.. అక్కడ ఉన్న పిల్లర్‌ను పట్టుకొని రక్షించండి.. అంటూ అరవ సాగాడు. అది రాత్రి పూట కావడం.. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ వ్యక్తి ఆర్తనాదాలను పట్టించుకున్న నాథుడే లేడు. ఇక చేసేది లేక.. రాత్రి మొత్తం ఆ పిల్లర్నే పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఉదయం 6 గంటల సమయంలో వాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్లు అతడిని గమనించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతడిని తాడు వేసి పైకి లాగారు. అంత పైనుంచి కింద పడ్డా.. నీళ్లు ఉండటంతో ఆ వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదు. అలా.. రాత్రంతా నదిలో మనోడు జాగారం చేయాల్సి వచ్చింది.