సోనూసూద్ రియల్ హీరో అంటోన్న కేటీఆర్..

హీరో సోనూసూద్ చేస్తోన్న పనుల వల్ల ఇటీవల కాలంలో అందరితో శభాస్ అనిపించుకుంటున్నారు. కాగా మంత్రి కేటీఆర్ సోనూసూద్ ని రియల్ హీరో అన్నారు. విషయం ఏంటంటే ట్విట్ట‌ర్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు, సినీన‌టుడు సోనూసూద్‌కు మధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. క‌రోనా వేళ కేటీఆర్ కు ట్విట్ట‌ర్ లో ప్ర‌జ‌ల నుంచి అనేక విజ్ఞ‌ప్తులు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. వాటిలో వీలైనంత మందికి కేటీఆర్ సాయం చేస్తున్నారు.ఈ నేప‌థ్యంలో కేటీఆర్ వ‌ల్ల తనకు దక్కిన సాయానికి కృతజ్ఞతగా నంద కిశోర్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు. ఆక్సిజన్ కాన్స‌న్‌ట్రేట‌ర్ల‌ను తాను అడ‌గ‌గా కేటీఆర్ అందేలా చేశార‌ని ఆయ‌న చెప్పాడు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ నుంచి అందుతున్న సాయం మరువలేనిదని చెప్పుకొచ్చాడు. కేటీఆర్‌ను సూపర్ హీరో అని పొగిడాడు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. తాను ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా తోచిన సాయం మాత్రమే చేశానని చెప్పారు. సోనూసూద్ ను మాత్ర‌మే సూపర్ హీరో అనడం కరెక్ట్ అని ఆయ‌న అన్నారు. ఆ ట్వీట్‌లో కేటీఆర్ త‌న పేరును ట్యాగ్ చేయ‌డంతో దీనిపై సోనూసూద్ స్పందించారు. ‘థ్యాంక్ యూ సో మచ్ స‌ర్’ అని ట్వీట్ చేశారు.తెలంగాణకు కేటీఆర్ చాలా చేస్తున్నారని, కాబట్టి ఆయ‌నే రియల్ హీరో అని సోను పేర్కొన్నారు. మీ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, తెలంగాణ త‌న‌కు మరో ఇంటిలాంటిదని ఆయన అన్నారు. కొన్నేళ్లుగా అక్కడి ప్రజలు త‌న‌ మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని సోనూసూద్ చెబుతూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *