స్కైడైవింగ్ చేసిన జ‌వానులు..ఎక్క‌డో తెలుసా..!

స్కై డైవింగ్ చేశారు జ‌వానులు..ఆ వివ‌రాలు చూద్దాం.. దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఆ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అదేవిధంగా బీఎస్ఎఫ్‌, ఐటీబీపీ తదితర విభాగాలకు చెందిన జవాన్‌లు తమతమ ప్రదేశాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి జెండా పండుగ జరుపుకున్నారు. ఇక రాజస్థాన్‌లోనూ జవాన్‌లు ఘనంగా స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు చేసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లాలోని చందన్ రేంజ్‌లో జవాన్‌లు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్కై డైవింగ్ చేశారు. స్కై డైవింగ్ ద్వారా జవాన్‌లు చేసిన విన్యాసాలు చూపరులను అలరించాయి. ఈ స్కై డైవింగ్‌లో మొత్తం 75 మంది జవాన్‌లు పాల్గొన్నారు. జవాన్‌ల స్కై డైవింగ్‌కు సంబంధించిన వీడియోలను మీరు కూడా వీక్షించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *