స్పేస్ రైస్ అంటే ఏంటో తెలుసా..

స్పేస్ రైస్ గురించి తెలుసా..స్పేస్ రైస్ ఏంటీ అనుకుంటున్నారా..ఈ రైస్ నాలుగేండ్లలో అందుబాటులోకి వస్తుందట. స్పేస్‌ రైస్‌ స్వర్గం నుంచి తీసుకొచ్చిన ధాన్యరాశులతో ఇంట్లో పరమాన్నం వండుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. నమ్మలేకపోతున్నారా ఇది నిజం. రోదసి నుంచి తెచ్చిన విత్తనాలతో చైనా పంటను పండించబోతున్నది. ఆ మేలైన ధాన్యాన్ని ‘రైస్‌ ఆఫ్‌ హెవెన్‌’ లేదా ‘ స్పేస్‌ రైస్‌ ‘గా పిలుస్తున్నారు.రానున్న రోజుల్లో ప్రపంచాన్ని తీవ్రమైన ఆహార కొరత వేధిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తిండి గింజల నాణ్యత, దిగుబడి కూడా రోజుకోజుకూ దిగజారుతున్నది. వీటికి పరిష్కారాన్ని చూపుతూ..స్పేస్‌ రైస్‌’ను తీసుకొచ్చారు. అంతరిక్షంలో కాలుష్యరహిత వాతావరణంలో, సూర్యరశ్మి, కాస్మిక్‌ రేడియేషన్‌, గురుత్వాకర్షణ శక్తిలేని పరిస్థితులకు లోనైన ఈ స్పేస్‌ రైస్‌.. అధిక నాణ్యతతో పాటు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడిని ఇస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం రోదసి నుంచి ఒక సెంటీమీటర్‌ పొడువుతో ఉన్న 40 గ్రాముల తిండి గింజలు వచ్చాయి. దక్షిణ చైనా వ్యవసాయ యూనివర్సిటీలోని ల్యాబ్‌లో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ విత్తనాలను సాగు చేయనున్నారు. మార్కెట్లోకి ఈ రైస్‌ అందుబాటులోకి రావాలంటే మరో 3-4 ఏండ్లు వేచిచూడాలి. టొమాటో, పత్తి వంటి 200 పంటలపై కూడా ఈ తరహా ప్రయోగాలు జరుగుతున్నాయి. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నవంబర్‌లో చైనా ఛాంగే-5 వ్యోమనౌకను పంపించింది. ఈ వ్యోమనౌకలో కొన్ని తిండి గింజలను (ధాన్యం) కూడా పరిశోధకులు పంపించారు. చంద్రుడి చుట్టూ 23 రోజులపాటు 7.60 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసిన అనంతరం డిసెంబర్‌లో ఈ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. దీంతో పాటు ఆ ధాన్యం కూడా వచ్చింది. దాదాపు మూడు వారాలపాటు రోదసిలో ప్రయాణం చేసిన ఈ ధాన్యాన్ని ‘స్పేస్‌ రైస్‌’గా పిలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *