15 తర్వాత ఫాస్టాగ్ లేకుంటే..
దేశవ్యాప్తంగా ఉన్న టోల్‌గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్రం ప్రభుత్వం 2017లో ‘ఫాస్టాగ్’ విధానం తీసుకొచ్చింది. అప్పటి నుంచి అమలు చేస్తున్న ఈ విధానం గడువు పొడగిస్తూనే వస్తున్నారు. ఇక ఫిబ్రవరి 15 చివరి గడువు అని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత ‘ఫాస్టాగ్’ లేకపోతే వాహనం టోల్‌గేట్ దాటదని అధికారులు చెప్తున్నారు.
టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ తగ్గించడంతో నగదు రహిత చెల్లింపుల ప్రోత్సాహానికి ఈ ఫాస్టాగ్ దోహదం చేస్తుంది. ఫిబ్రవరి 15 డెడ్ లైన్ ఆఖరు అని తేల్చి చెప్పింది. ఫాస్టాగ్ లేకపోతే జాతీయ రహదారులపై మీ కార్లు, లారీలు తదితర వాహనాలు అనుమతించరు. ఫాస్టాగ్ చేసుకునేందుకు కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా 720 టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు చేయించుకోకపోతే వెళ్లి ఫాస్టాగ్ చేసుకోండి.