5కేజీల బరువుతో పుట్టిన శిశువు..ఎక్కడో తెలుసా..

సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత బరువు ఉంటారు అంటే వారి హెల్దీని బట్టి 3కేజీల వరకు ఉంటారు. కానీ ఇక్కడ ఓ శిశువు ఏకంగా 5కేజీల బరువుతో పుట్టింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం మాల్దా జిల్లాలో మిరాకిల్ చోటుచేసుకుంది. ఓ 29 ఏండ్ల మ‌హిళ 5.1 కిలోల బ‌రువున్న ఆడ శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మాల్దాకు చెందిన ర‌క్షా కుశ్వాహ (29) అనే మ‌హిళ పురిటి నొప్పుల‌తో అంజినీయ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్క‌డ వైద్యులు ఆమెకు ప్ర‌స‌వం చేయ‌గా 5.1 కిలోల ఆడ శిశువు జ‌న్మించింది. దాంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం వైద్యుల వంతు అయ్యింది.సాధార‌ణంగా అప్పుడే పుట్టిన శిశువులు 2.5 కేజీల నుంచి 3.7 కేజీల బ‌రువు ఉంటార‌ని, అంత‌కుమించిన బ‌రువుతో శిశువులు జ‌న్మించ‌డం అత్యంత అరుద‌ని వైద్యులు తెలిపారు. మ‌రీ 5 కేజీల‌కు మించిన బ‌రువుతో శిశువులు జ‌న్మించ‌డం మాత్రం అసాధార‌ణ‌మ‌ని చెప్పారు. ర‌క్షా కుశ్వాహ జ‌న్మ‌నిచ్చిన పాప 5.1 కేజీల బ‌రువు, 54 సెంటీమీట‌ర్ల పొడ‌వు ఉన్న‌ద‌ని ఆమెకు ప్ర‌స‌వం చేసిన వైద్యుడు అజ‌య్ తోష్ వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *